ఫ్రెండ్స్ ఈ పాప పేరు జ్యోతి తండ్రి నరసింహులు... కడపజిల్లా సింహాద్రిపురం మండలం పైడిపాళ్ళెం గ్రామం హరిజనవాడకు చెందినవారు.. ఈ అమ్మాయి ప్రస్తుతం 10వ తరగతి చదువుతోంది. నిరుపేదలైన వీరికి అనుకోని ఆపద వచ్చిపడింది. జ్యోతికి ప్రస్తుతం ప్రేగు క్యాన్సర్ వచ్చింది. హైదరాబాద్ బసవతారకం హాస్పిటల్ లో 6సార్లు చూపించారు. వారు ఆపరేషన్ చేయించాలని చెప్పారు. ఆపరేషన్ ఉచితంగా చేస్తారు కానీ వారికి అక్కడికి వెళ్ళడానికి డబ్బు లేక నిలబడిపోయారు. రోజూ కూలీ పనులు చేసుకుని బ్రతికే వీరికి అది తీరని భారం అవుతోంది. దీనితో దాతల సాహాయాన్ని అర్థిస్తున్నారు. దయగల వారు మీకు తోచినంత సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. మీరు ఒక్క రూపాయి అయినా పంపవచ్చు. కింద వాటికి సంభందించిన వివరాలు ఇచ్చాను. చూసిన ప్రాతి ఒక్కరు స్పందిస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్.
Paytm, Mobikwik, Airtel Payment Bank Number:- 7893084444
-------------------------------------------------------
Bank Details Please Donate :
stat Banak Of India :
Name of the payee : VYNATEYA CHARITABLE TRUST
Account No : 34175915766
Branch Code No : 013272
IFSC Code : SBIN0013272
Address of bank :
State Bank Of India
Erragadda, Hyderabad Dist,
Telangaana.
కడప అంటే పేరు కాదురా అదో బ్రాండ్ అన్నింటిలో మిన్న రా మా కడప మీ బత్తుక్కి రాజకీయాలు గొడవలు తప్ప ఏమి కనపడవు.. మా కడప గురించి నేను చెప్పే కొన్ని విషయాలు చదివి అయినా మారు “కడప” ఆ పేరు వింటేనే తెలియని ఒక అనుభూతి, తెలిసిన వాళ్ళకు ప్రేమానురాగాలు, ఆప్యాయతాభిమానాలు గుర్తుకు వస్తాయి. సాహిత్యాభిమానులకు వొళ్ళు పులకరిస్తోంది. కానీ కడప అనగానే చాలామందికి గుర్తు వచ్చేది బాంబులు, కాఠిన్యం, కరకుదనం, అదంతా కేవలం కల్పితం మాత్రమే సినిమాలలో చూసి అదే నిజం అనుకుంటున్న వాళ్ళు తెలుసుకోవలసింది చాలా ఉంది. కడప అంటే ఆధ్యాత్మికం, సాహిత్యం, సామరస్యం మొదలైనవి కలగలసిన అందమైన ప్రదేశం. కడప జిల్లా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని రాయలసీమ ప్రాంతమునకు చెందిన జిల్లా. తిరుమల క్షేత్రానికి దేవుని కడప తొలి గడప అంటారు. ఇక్కడి వేంకటేశ్వర స్వామిని కృపాచార్యులు ప్రతిష్ఠించారని ప్రతీతి. అందు వలన ఈ పట్టణానికి కృపాపురమని పేరు వచ్చింది. కృపాపురమే కడపగా మారిందంటారు. క్రీ.శ. 2వ శతాబ్దంలో టాలెమీ అనే విదేశీ యాత్రికుడు కడపను దర్శించాడు.
ఈ ఊరిని కరిపె, కరిగె అంటారని రాశాడు. కరిపె అనే మాటే చివరికి కడపగా మారి ఉండవచ్చు. సుప్రసిద్ధ వాగ్గేయకారుడు మరియు సంకీర్తనాచార్యుడయిన అన్నమయ్య, ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన, తెలుగు జాతీయ కవి వేమన, తొలి తెలుగు కవయిత్రి తాళ్ళపాక తిమ్మక్క, మరో ప్రసిద్ధ కవయిత్రి మొల్ల, మహోన్నతమైన యోగి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, అయ్యలరాజు రామభద్రుడు ఈ జిల్లాకు చెందినవారే. ప్రపంచ ప్రఖ్యాత సురభి నాటక సమాజం ప్రస్థానం 1885లో కడప జిల్లా సురభి గ్రామంలో 'కీచక వధ'నాటక ప్రదర్శనతో మొదలయ్యింది. ఈ సమాజ వ్యవస్థాపకుడు వనారస గోవిందరావు. కడప జిల్లా బెరైటీస్(ముగ్గురాయి) గనులు మరియు కడప బండలకు ప్రసిద్ధి చెందినది. జిల్లాకు తూర్పున శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, పశ్చిమాన అనంతపురం మరియు దక్షిణాన చిత్తూరు జిల్లాలు కలవు. కర్నూలు మరియు ప్రకాశం జిల్లాలు ఉత్తరాన సరిహద్దులు. పూర్వము ఈ జిల్లాకు హిరణ్యదేశమని పేరు కలదు. ఈ ప్రదేశము పల్లవులు, తెలుగు చోళులు, కాకతీయులు, విజయనగర రాజులు, గండికోట పెమ్మసాని నాయకులు, నిజాము నవాబులు, సిద్ధవటం నుంచి పరిపాలించిన మట్లి రాజులు, మరియు కడప నవాబులచే పరిపాలించబడినది. కడప జిల్లా చరిత్ర చాలా ప్రాచీనమైనది.
కడప జిల్లాను గతంలో హిర్యణ రాజ్యం అని వ్యవహరించేవారు. క్రీ.పూ. 274-236 ప్రాంతంలో అశోక చక్రవర్తి ఈ ప్రాంతాన్ని పాలించాడు. ఆ తరువాత శాతవాహనులు పాలించారు. శాతవాహనుల నాణేలు పెద్దముడియం, దానవులపాడు గ్రామాల్లో దొరికాయి. క్రీ.శ. 250-450 ప్రాంతంలో పల్లవరాజులు పాలించారు. ఇంకా రాష్ట్రకూటులు, చోళులు, కళ్యాణి చాళుక్యులు, వైదుంబులు, కాకతీయులు మొదలైన రాజవంశాలు ఈ ప్రాంతాన్ని పాలించాయి. క్రీ.శ. 1336-1565 కాలంలో విలసిల్లిన విజయనగర సామ్రాజ్యంలో కడప జిల్లా ఒక భాగం. గండికోట ను పాలించిన పెమ్మసాని నాయకులు విజయనగర రాజులకు సామంతులుగా విధేయులై పేరుప్రఖ్యాతులుపొందారు. నంద్యాల రాజులు, మట్లి రాజులు కూడ ఈ ప్రాంతం మీద పెత్తనం సాగించారు. విజయనగర పతనం తర్వాత గోల్కొండ నవాబులు, బీజాపూరు సుల్తానులు, ఔరంగజేబు మొదలైన మహమ్మదీయ రాజులు పాలించారు. క్రీ.శ. 1710 ప్రాంతంలో అబ్దుల్ నబీ ఖాన్ కడపలో కోటను నిర్మించాడు. ఆ తరువాత ఈస్టిండియా కంపెనీ ఈ ప్రాంతం మీద ఆధిపత్యం వహించింది. సర్ థామస్ మన్రో కడప జిల్లా కలెక్టరు గా పని చేశాడు. రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు.
ఈ ప్రాంతపు అభివృద్ధికి తెల్లదొరలు కొంతవరకు కృషి చేశారు. మన్రో ఈ ప్రాంతపు దేవాలయాల అభివృద్ధికి మడిమాన్యాలిచ్చాడు. సి.పి.బ్రౌన్ తెలుగుభాషను సముద్ధరించాడు. మనుచరిత్ర, వసుచరిత్ర వంటి తెలుగు కావ్యాలను ముద్రించాడు. మూడు వేలకు పైగా వేమన పద్యాలను సేకరించాడు. వాటిని ఇంగ్లీషులోకి అనువదించి అచ్చు వేయించాడు. ఇక కల్నల్ మెకంజీ గ్రామాల చరిత్రను సేకరించి కైఫీయతుల పేరుతో భద్రపరిచాడు. రాయలసీమలోని నాలుగు జిల్లాలు మరియు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నడిబొడ్డైన కడపలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అనేక ప్రాంతీయ, కేంద్ర కార్యాలయాలు ఉన్నాయి. తూర్పున నెల్లూరు జిల్లా, పశ్చిమాన అనంతపురం జిల్లా, దక్షిణాన చిత్తూరు జిల్లా, ఉత్తరాన కర్నూలు జిల్లా,ప్రకాశం జిల్లాలు సరిహద్దులుగా వున్నాయి. కొండప్రాంతం, నైసర్గికంగా పీఠభూమి, నల్లనేల భాగాలుగా చెప్పుకోవచ్చు. శేషాచలం కొండలు ఈ జిల్లాలో విస్తారంగా వ్యాపించి ఉన్నాయి. వాటిని పాలకొండలని, నల్లమల కొండలని, వెలికొండలని, ఎర్రమల కొండలని పిలుస్తారు. జిల్లాలో నల్లరేగడి, ఎర్రరేగడి, ఇసకపొర నేలలు వున్నాయి.
నదులు పెన్న, చిత్రావతి, కుందేరు, పాపాఘ్ని, సగిలేరు మరియు చెయ్యేరు జిల్లాలో ప్రవహించే ప్రధాన నదులు. అటవీ సంపద అడవుల విస్తీర్ణం 4,96,672 హెక్టార్లు, జిల్లా విస్తీర్ణంలో 32.3 శాతం అన్నమాట.పులివెందుల మండలంలో తప్ప నల్లచేవ, ఎర్రచేవ,ఎపి మొదలైన కలప జాతులు , విదేశీమారకము తెచ్చిపెట్టే ఎర్రచందనము లభ్యమవుతుంది. ప్రపంచంలో మరెక్కడా కనిపించకుండా ఆంతరించి పోయిందనుకున్న కలివికోడి ఇక్కడి శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యంలో కనిపించింది. సింహాలు, చిరుతపులులు, మెదలయిన వన్యప్రాణులు ఈ అడవులలో నివసిస్తున్నాయి. జలవనరులు తుంగభద్ర నది మీద సుంకేశుల ఆనకట్ట వద్ద మొదలై "కర్నూలు కడప కాలువ" కడప మరియు కర్నూలు జిల్లాల ద్వారా ప్రవహిస్తూ నాలుగు వేల హెక్టార్ల సాగుభూమికి నీటిని సమకూరుస్తున్నది. సాగునీటి పారుదల కొరకు హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు మరియు పులివెందల కాలువ నిర్మాణములో ఉన్నవి. బుగ్గవంక నది మీద ఇప్పపెంట గ్రామము వద్ద పుల్లల మడుగు జలాశ్రయము నిర్మించబడినది. గాలేరు నగరి సుజల స్రవంతి కాలువ, జిల్లాలో త్రాగునీటికి ముఖ్య ఆధారము. మాధవరం చేనేత పరిశ్రమ జిల్లాకు ఆదాయము తెచ్చిపెట్టే ఒక ముఖ్య ఆధారము.
ఆర్ధిక స్థితిగతులు వ్యవసాయం వరి, సజ్జ, జొన్న, రాగి వంటి ఆహార ధాన్యాలు, మామిడి, చీనీ, బొప్పాయి వంటి పండ్ల తోటలు, చెఱకు, పసుపు వంటి వాణిజ్య పంటలు పండుతున్నాయి. చెన్నూరు తమలపాకులు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. మైదుకూరు ప్రాంతంలో పండే కె.పి.ఉల్లి విదేశాలకు ఎగుమతి అవుతుంది. కృష్ణాపురం గ్రామం పేరు మీదుగా ఆ వంగడానికి ఆ పేరు వచ్చింది. జిల్లాలో పెన్నానది, కె.సి.కాలువ ప్రధానమైన నీటి వనరులు. జిల్లా మొత్తంలో కాలువల క్రింద 24 వేల హెక్టార్లు, చెరువుల క్రింద 22 వేల హెక్టార్లు, బావుల క్రింద 66 వేల హెక్టార్లు తక్కిన వనరుల క్రింద 11 వేల హెక్టార్లు సాగులో వున్నాయి. ఊటుకూరులో వ్యవసాయ పరిశోధనా కేంద్రము , కృషి విజ్ఞాన కేంద్రము, అనంత రాజపేటలో పండ్ల పరిశోధన కేంద్రము, మైదుకూరులో జాతీయ ఉద్యనవనాల పరిశోధనాభివృద్ధి సంస్థ కలవు. ఖనిజాలు - పరిశ్రమలు వైఎస్ఆర్ జిల్లాలో ప్రపంచంలో మరెక్కడా లభించనంత ముగ్గురాయి (బెరైటీస్) మంగంపేట గనుల్లో లభిస్తోంది. పులివెందుల ప్రాంతంలో రాతినార తీస్తున్నారు. నాప రాళ్ళకు కడప పెట్టింది పేరు.
పులివెందుల నియోజకవర్గంలో యురేనియం నిక్షేపాలను కనుగొన్నారు. వేముల మండలంలోని తుమ్మలపల్లె గ్రామంలో యురేనియం శుద్ధి కర్మాగారం నిర్మాణంలో ఉంది. యర్రగుంట్ల ప్రాంతంలో సిమెంటు పరిశ్రమ, విస్తరిస్తోంది. జమ్మలమడుగులో ఉక్కు కర్మాగారం నిర్మాణంలో ఉంది. ముద్దనూరు దగ్గర ఏర్పాటైన రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు మెగాపవర్ ప్రాజెక్టు అయ్యే దిశగా పురోగమిస్తోంది. కడప ప్రొద్దుటూరు లో పారిశ్రామిక వాడలున్నాయి. రాయలసీమ అభివృద్ధి పథకం కింద కడపలో చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ నెలకొల్పడంజరిగింది. రవాణా సౌకర్యాలు బ్రిటిష్ కాలంలో ఏర్పాటైన కడప విమానాశ్రయం 1990 దశకంలో మూతపడింది. దాన్ని తిరిగి తెరిపించడానికి పనులు చురుగ్గా సాగుతున్నాయి. దేశంలోని అతి ప్రధానమైన రైలు మార్గాల్లో ఒకటిగా 1854-1866 మధ్య కాలంలో వేయబడిన ముంబై-చెన్నై రైలు మార్గం ఈ జిల్లాలో ఉన్న ఏకైక రైలు మార్గం. రైల్వే కొండాపురం, ముద్దనూరు, ఎర్రగుంట్ల, కమలాపురం, కడప, ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట, రైల్వే కోడూరు ఈ జిల్లాలో ఈ రైలు మార్గం కలిపే ముఖ్య పట్టణాలు.
ముఖ్య వాణిజ్య పట్టణమైన ప్రొద్దుటూరు మీదుగా ఎర్రగుంట్ల-నంద్యాల రైలు మార్గం నిర్మాణ దశలో ఉంది. కడప-నెల్లూరు, కడప-బెంగుళూరు రైలు మార్గాలు వెయ్యాలనే ప్రతి పాదనలు ఉన్నాయి. కర్నూలు-కడప-చిత్తూరు పట్టణాలను కలిపే 18వ నంబరు జాతీయ రహదారి, కడప-చెన్నై, కడప-బెంగుళూరు రాష్ట్ర రహదారులు. నెల్లూరు-బళ్ళారిలను కలిపే మరో ముఖ్యమైన రహదారి మైదుకూరు మీదుగా వెళ్తుంది. గ్రంథాలయాలు కడపలో యోగి వేమన విశ్వవిద్యాలయం, రిమ్స్ (రాజీవ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) వైద్య కళాశాల ముఖ్యమైనవి. ఇవి కాక పులివెందులలో జే.ఎన్.టీ.యూ. (జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం) ఇంజినీరింగ్ కళాశాల ఉంది. ఇక కడపలో సి.పి.బ్రౌన్ నివసించిన బంగళాలో ఆయన పేరిట నెలకొల్పిన బ్రౌన్ గ్రంథాలయం ప్రస్తుతం యోగి వేమన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా భాషా సాహిత్య పరిశోధనా కేంద్రంగా పనిచేస్తోంది.
ఆకర్షణలు ధార్మిక వ్యవస్థకు పునాదులైన ఎన్నో దేవాలయాలు, క్షేత్రాలు, తీర్థాలు ఈ జిల్లాలో ఉన్నాయి. రాజులు, రాజ్యాలు అంతరించినా ఆనాటి చరిత్రకు గుర్తులుగా చాంద్ పీరా గుంబద్, గండికోట దుర్గం, గండికోట, సిద్ధవటం కోట, ఓంటిమిట్ట, తాళ్ళపాక వున్నాయి. భగవాన్ మహావీర్ ప్రభుత్వ సంగ్రహాలయం కడపలో కలదు. దేవుని కడప, బ్రహ్మంగారిమఠం, పుష్పగిరి, నాగేశులకొండ, సిద్దయ్య.
(రాయలసీమ పరిరక్ష్యణ సమితి)